10-11-2025 01:25:15 AM
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 9 (విజయ్‌క్రాంతి):వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు తేది: 22-10-2025 బుధవారం నుండి తేది: 20-11-2025 గురువారం వరకు సామూహిక కార్తీక దీపోత్సవం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం 19వ రోజుభీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.
ఆలయ ఈవో ఎల్ రమాదేవి. భీమేశ్వర స్వామి ఆలయ దేవాల యంలో సేవా సమితి సభ్యులు భక్తి గీతాలు,భజనలతో భక్తులను అలరించారు. కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రతి రోజూ సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సుహాసినీల ఆధ్వ ర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినీలకు ఆలయ అర్చకులు మరియు ఆలయ ఉద్యోగులు చేతుల మీదుగా వాయ నం పసుపు కుంకుమ అక్షింతలు గాజులు స్వామివారి ఫోటోను అందజేయడం జరిగినది.ఏఈఓ జయకుమారి పర్యవేక్షకులు పూజిత, శ్రీకాంత్ చారి, కూరగాయల శ్రీనివాస్ టి రాజేశ్వర్ గౌతమ్