03-09-2025 10:21:01 PM
చర్ల,(విజయక్రాంతి): మండలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో వద్దిపేట, విజయ కాలనీ, భూములంక గ్రాలలో దోమల మందు ఏసఎం 5% మందు పిచికారి చేయటం జరిగినది.
అనంతరం రాళ్ళగూడెం మరియు గొల్లగూడెం గ్రామం లో పైరిత్రుం స్పేస్ స్ప్రే చేయడం జరిగింది, ఈ సందర్భంగా డ్రాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ దోమలు పపెరగకుండా చూసుకోవాలని, ఇంటి చుట్టూ నీటి నిలువలు చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, దోమల కుట్టకుండా దోమతెరలు వాడాలని, ఆరోగ్య పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.