21-07-2024 03:42:41 PM
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడు ఆదివారం మృతి చెందాడు. బాలుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇవాళ ఉదయం 10.50కు తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. నిఫా వైరస్ సోకినట్లు నిర్థరించిన కొన్ని గంటల్లోనే బాలుడు గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తూ బాలుడి అంత్యక్రియలు జరిపించనుట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. మళప్పురం జిల్లా మలప్పురానికి చెందిన బాటుడికి నిఫా వైరస్ సోకినట్లు వీణా జార్జ్ శనివారమే చెప్పారు. పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్ధారించారు.