calender_icon.png 15 September, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టులకు జలకళ

21-07-2024 04:07:46 PM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  ప్రాజెక్టులకు అధికంగా వరద నీరు చేరుతుంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పొటెత్తుతుంది. జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 92 వేలు, ఔట్ ఫ్లో 1.71 లక్షల క్యూసెక్కులు వస్తుండడంతో భారీగా వరదనీటి చేరికతో 17 గేట్లు తెరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 అడుగులు కాగా, జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 317.17 అడుగులకు చేరింది.

జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 7.04 టీఎంసీలు ఉంది. అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులు జలకళలాడుతున్నాయి.  శ్రీశైలం, నాగార్జునసాగర్ కు వరద వెల్లువెత్తుతోంది. శ్రీశైలంలో గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817 అడుగులకు చేరింది. ప్రకాశం బ్యారేజీలో 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం స్పిల్ వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది.