21-07-2024 02:03:35 PM
న్యూఢిల్లీ: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం కాసేటి క్రితమే ముగిసింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది. సభ ముందుంచే బిల్లుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు అందించింది. ఈ భేటీలో లోక్ సభ డిప్యూటీ స్వీకర్ పదవి కావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. హాట్ హాట్ గా సాగిన అఖిలపక్ష సమావేశంలో నీట్ సమస్యను కాంగ్రెస్ లేవనెత్తింది. ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయించడంపై చర్చకు డిమాండ్ చేసింది.
ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కోరుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఒడిశాకు ప్రత్యేక హోదా కోరుతున్న బిజూ జనతాదళ్, బిహార్కు ప్రత్యేక హోదా కోసం ఆర్జేడీ, లోక్జనశక్తి డిమాండ్ చేశాయి. బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలంటున్న జేడీయూ పట్టుబట్టినట్లు సమాచారం. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. సోమవారం కేంద్రం పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టనుంది. 23న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.