calender_icon.png 12 October, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెయిన్ ఓ విజన్ ఎక్స్‌లెన్స్ అవార్డులు

12-10-2025 03:27:37 AM

  1. ‘భారత్ ఎడ్యుకేషన్’పై 25న నిర్వహణ
  2. సీఈవో గణేష్ నాగ్‌దొడ్డి వెల్లడి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఈ నెల 25న భారత్ ఎడ్యుకేషన్ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం బ్రెయిన్ ఓ విజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సీఈవో గణేష్ నాగ్‌దొడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలో వున్నా ఫ్యాకల్టీ వారి గుర్తింపు కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా వున్నా 250 కాలేజీ కాలేజీల నుంచి 400పైగా ఫ్యాకల్టీ ఎంపికైనట్టు తెలిపారు. 2,500 మంది నామినేషన్ రాగ అందులో నుంచి 500 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ అవార్డుల్లో భాగంగా 2లక్షల 50వేల మంది పైగా ఓటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు.

తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని అన్ని రాష్టాల్లో విద్యార్థులు ఈ నామినేషన్‌లో పాల్గొన్నరన్నారు. ఈ నెల 25న టీ హబ్ వేదికగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు, దీనికి ముఖ్య అతిధిగా అల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ చీఫ్ కోర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధా చంద్రశేఖర్‌తో పాటు వివిధ కాలేజీల చైర్మన్‌లు, వైస్ ఛాన్సెలర్ హాజరవుతరాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాల నాగరాజు, కే కృష్ణమూర్తి పాల్గొన్నారు.