calender_icon.png 12 October, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభయ సీనియర్ సిటిజన్ భవనం ప్రారంభం

12-10-2025 03:29:13 AM

సాయినగర్ కాలనీలో ఏర్పాటు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీ (సౌత్)లో అభయ సీనియర్ సిటిజన్, వెల్ఫేర్ అసోసియేషన్ భవనం శనివారం ఘనంగా ప్రారంభమైం ది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. “సమాజంలో సీనియర్ సిటిజన్లు అమూల్యమైన అనుభవ సంపద కలవారు. వారికి సౌకర్యవంతమైన వేదికలు అందించడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. 

ఇటువంటి సదుపాయాలు వృద్ధుల సంక్షేమానికి తోడ్పడతా యి అని తెలిపారు. కార్యక్రమంలో సాయి నగర్ సౌత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బద్దం భాస్కర్‌రెడ్డి, జనరల్ సెక్రెటరీ ఉమేష్‌గౌడ్, వైస్ ప్రెసిడెంట్ రేవంత్ గౌడ్, సుధా కర్, జాయింట్ సెక్రెటరీ పరమేశ్వర్‌రెడ్డి, శివ, కృష్ణారెడ్డి, రాము, భాస్కర్, భారత్, రామ్‌రెడ్డి, వీరచారి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.