calender_icon.png 17 September, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ

17-09-2025 04:45:01 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర పార్టీ సేవా పక్వాలో భాగంగా భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆర్కే ఎస్ ఫౌండేషన్ చైర్మన్, బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో నల్లగొండ జిల్లా ప్రభుత్వం ఆసుపత్రిలో బుధవారం ప్రసూతి మహిళాలకు, రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణి చేశారు. రోగుల సహాయకులకు, అల్పాహారం వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పొతేపాక సాంబయ్య, జిల్లా నాయకులు లకడాపురం వెంకటేశ్వర్లు, దొండ ముతేష్ యాదవ్,కార్యకర్తలు ఎల్లంల యాదయ్య,బోడిగే భరత్,బొబ్బ వెంకట్ రెడ్డి, సందీప్ రెడ్డి, అజయ్,కొప్పు మహేష్, బొమ్మకంటి సైదులు, బెల్లి నాగరాజు, బంగారి, కత్తుల శివ,పర్వతం శరత్, సంతోష్, సతీష్,బోడ వంశీ, ఉపేందర్,దాసోజు వాసు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.