17-09-2025 05:00:59 PM
మందమర్రి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవంను పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 రాష్ట్ర చరిత్రలో ఒక గౌరవ ప్రదమైన రోజు అని, 1948లో నిజాం పాలన నుండి విముక్తి పొందడం జరిగిందని అన్నారు.
విమోచనతో తెలంగాణ ప్రజలకు స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, స్వీయ పాలన సాధ్యమైందన్నారు. దేశ స్వాతంత్రానికి ఏకత్వానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తి కి ప్రతీక సెప్టెంబర్ 17 అని అన్నారు. ప్రజాపాలన లో పట్టణ ప్రజలు భాగస్వామ్యమై పట్టణ అభివృద్ధి, శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మంచినీటి సరఫరా, సురక్షిత వాతావరణం, బలమైన పౌర సదుపాయాలు, రోడ్లు వంటి అన్ని రంగాల్లో, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో విజయ వంతం గా అమలు చేస్తు పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
పట్టణంలో స్వచ్ఛభారత్..
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛహీ సేవ కార్యక్రమాన్ని పురస్కరించు కొని మున్సిపల్ కార్యాలయం నుండి ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం స్వచ్ఛహి సేవ ప్రతిజ్ఞ చేపట్టారు.