17-09-2025 04:33:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం విశ్వకర్మ జయంతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ డిసిసి అధ్యక్షులు శ్రీధర్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ భీమిరెడ్డి ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.