17-09-2025 06:33:35 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): విశ్వకర్మ జయంతిని బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని స్థానిక బ్రహ్మంగారి దేవాలయం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, విరాట్ విశ్వకర్మ భగవాన్ గాయత్రి మహా యజ్ఞం అనంతరం ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కేరళ వాయిద్య బృందం మహిళల కోలాటలతో భజనలతో వైభవంగా పట్టణ పురవీధుల గుండా శోభాయమానంగా సాగింది. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవం, ఆలయ అభివృద్ధి కమిటీ, పట్టణ స్వర్ణకార కమిటీ, పట్టణ కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. విశ్వకర్మ జయంతిలో విశ్వకర్మ బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.