calender_icon.png 17 September, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కోసం మోహన్ రెడ్డి చేసిన సేవలు మరవలేనిది

17-09-2025 06:44:03 PM

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ఎదుర్లగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్ఈ దివంగత గూడూరు మోహన్ రెడ్డి రైతుల కోసం చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సంగెం భీమ లింగం సమీపంలోని  శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పధకం వద్ద కీ.శే.గూడురు మోహన్ రెడ్డి  విగ్రహాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పథకం మంజూరు చేయించేందుకు మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటిని అందించేందుకు ఎంతో తోడ్పాటు అందించాలని అన్నారు.