calender_icon.png 17 September, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

17-09-2025 06:39:48 PM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తంగళ్ళపల్లి,(విజయశాంతి): జిల్లాలో త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో మొత్తం 57 ఇండ్ల నిర్మాణానికి మార్క్ ఔట్ చేశారు. బేస్మెంట్ లెవెల్ లో 10, గోడల దశలో 10, స్లాబ్ దశలో 20 ఉన్నాయని, 17 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ దృష్టికి ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తీసుకెళ్లారు.

గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయిస్తున్న పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకొని రానున్న పండుగకు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.