17-09-2025 06:36:14 PM
మోతె: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించి శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందింపజేస్తాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నామవరం గ్రామంలో జిల్లా పరిష్యత్ ఉన్నత పాఠశాల లో అండర్ 14, అండర్ 17 బాల బాలికలకు క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం అయన మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలకు క్రీడలు దోహదపడుతాయని చెప్పారు. కీసర సత్యనారాయణ, కీసర వినీత్ రెడ్డి జ్ఞాపకార్థం పాఠశాల స్థాయి ఆటలు నిర్వహించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యం. వెంకన్న, యం పి డి ఓ ఆంజనేయులు, యం ఇ ఓ కె. గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.