calender_icon.png 25 September, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి పాలే శిశువులకు శ్రేష్ఠం

25-09-2025 12:00:00 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : తల్లిపాలే శిశువులకు శ్రేష్టమైనవని  జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి అన్నారు. బుధవారం పోషణ మాసం-2025 లో భాగంగా సూర్యాపేట పట్టణం 60 ఫీట్ రోడ్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లి పాల అవగాహన కార్యక్రమం లో పాల్గొనీ మాట్లాడారు. పుట్టిన వెంటనే తల్లి పాలను శిశువుకు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని,తల్లి పాలలో ఉన్న పోషకాలు శిశువు శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయన్నారు.

చిరుధాన్యాల ద్వారా తయారు చేసిన పౌష్టికాహారం అందించాలన్నారు. తదుపరి గర్భిణీలకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాసన, అక్షర బ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  సిడిపిఓ లు కిరణ్మయి, సుబ్బలక్ష్మి, మహిళా సాధికారత కో ఆర్డినేటర్ చైతన్య, సూపర్ వైజర్లు, అంగన్వాడీలు, సిబ్బంది పాల్గొన్నారు.