calender_icon.png 25 September, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేడ్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

25-09-2025 12:00:00 AM

నారాయణఖేడ్, సెప్టెంబర్ 24:వార్షిక తనిఖీలలో భాగంగా నారాయణఖేడ్ పోలీ సు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పో లీసుల గౌరవ వందనం స్వీకరించి, డిఎస్పీ వెంకట్ రెడ్డి తో కలిసి స్టేషన్ ఆవరణలో మొ క్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, సీజ్ చేసిన క్రైమ్ వెహికిల్స్ ను తనిఖీ చేశారు.స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ భాదితులకు అండగా నిలవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పా ట్స్ గా గుర్తించి, వాహనాల వేగం అదుపున కు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు, సూ చిక బోర్డు లను ఏర్పాటు చేయాలని అ న్నారు. సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థలలో, పని ప్రదేశాలలో అవగాహన కార్య క్రమాలను నిర్వహించాలని అన్నారు. స్టేషన్ రికార్డుల మెయింటనెన్స్, సిబ్బంది పని తీరు బాగుందని, ఎస్హెచ్‌ఓ విద్యాచరణ్ రెడ్డి, సి బ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ తనిఖీలో నారాయణఖేడ్ డీయస్పి వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.