25-09-2025 12:00:00 AM
పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్‌రెడ్డి
నూతనకల్, సెప్టెంబర్ 24 : మండలంలో రైతుల ప్రయోజనం కోసం ఇక మీదట యూరియా టోకెన్లు స్థానికంగా ఉన్న రైతు వేదికల్లో పంపిణీ చేయనున్నట్లు నూతనకల్ పిఏసిఎస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం నూతనకల్ తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
నూతనకల్ మండల కేంద్రంలోకి గ్రామాల నుంచి వచ్చిన రైతులు యూరియా తీసుకోవడానికి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, దానిని గ్రహించి ఇక మీదట రైతువేధికల్లో టోకెన్లు అందించి యూరియా మాత్రం నూతనకల్ పీఏసీయస్ కార్యాలయంలో అందిస్తామన్నారు.
ఈ నెల 25 నా నూతనకల్ రైతు వేదికలో 26 దిర్శన పెళ్లి రైతు వేదికలో 27 నా తాళ్ల సింగారం రైతు వేదికలో అక్టోబర్ 1న మిర్యాల రైతు వేదికలో యూరియా టోకెన్లు అందిస్తున్నట్టు వివరించారు. ఈ యూరియా టోకెన్లు అందించే సమయంలోనే యూరియా ఎప్పుడు పంపిణీ చేసేది తెలియజేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దారు శ్రీనివాసరావు, ఎస్‌ఐ నాగరాజు,నూతనకల్ మండల వ్యవసాయ అధికారి మల్లారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు జానయ్య, సాయి,ప్రసాద్, మౌనిక, భవ్య తదితరులు పాల్గొన్నారు.