బెల్లాల్ గ్రామంలో తల్లి పాల వారోత్సవాలు
బోధన్,(విజయ క్రాంతి): బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు అందించే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నందిని మేడం, గోపి లక్ష్మి మేడం, అంగన్‌వాడీ టీచర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ, వార్డు సభ్యులు సంగీత, కవిత, ప్రసాద్‌తో పాటు పలువురు గర్భిణీలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యవంతంగా ఎదుగుతాడని, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలే ఉత్తమ ఆహారమని తెలిపారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి శిశువులకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది






