గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన గ్రామ ప్రతినిధులు
బోధన్,(విజయక్రాంతి): బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డిని గ్రామ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి బెల్లల్, అమ్డాపూర్, ఊట్‌పల్లి, రాజీవ్‌నగర్ తండా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ముఖ్యంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధులు స్పందిస్తూ, ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి అధికారులకు తగిన సూచనలు చేసిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి బెల్లల్, అమ్డాపూర్, ఊట్‌పల్లి, రాజీవ్‌నగర్ తండా గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.






