calender_icon.png 28 January, 2026 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

28-01-2026 12:00:00 AM

ఘట్ కేసర్, జనవరి 27 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలోని నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని లేనట్లయితే ప్రజలంతా ఏకమై జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని జన చైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ పాలకులను, అధికారులను, కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. ఘట్ కేసర్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ లో మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్ మంగళవారం 17 సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా కొనసాగుతున్న వంతెన నిర్మాణంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈసందర్భంగా యాదగిరియాదవ్ మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పాలకుల నిర్లక్ష్యం వల్ల అధికారుల అలసత్వం వల్ల నేటికీ అసంపూర్తిగానే ఉందన్నారు. ఈ ఆలస్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని పట్టణ అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం కొరకు మొదటి కాంట్రాక్టర్ 18 నెలల్లో బ్రిడ్జిని పూర్తి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ 16 సంవత్సరాలు అయినా పూర్తి చేయలేదన్నారు.

అనంతరం వచ్చిన కొత్త కాంట్రాక్టర్ 18 నెలల గడువులో పూర్తి చేస్తానని ఒప్పందం కుర్చుకోవడం జరిగిందని, ఐదు నెలలకు ఒకసారి ఒక స్లాబ్ వేయడం జరుగుతుందని దానివల్ల రెండు సంవత్సరాల వరకు కూడా బ్రిడ్జి పనులు పూర్తి కాదనేది తెలుస్తుందన్నారు. ఇప్పటికీ అధికారులకు ఎన్నో విన్నపాలు చేశాం కానీ ఫలితం శూన్యం అన్నారు. ఇక విన్నపాలు చేసే స్థితిలో లేమని ఈ కరపత్రం ద్వారా 15 రోజుల గడువు ఇవ్వడం జరుగుతుందని, పనుల్లో స్పష్టమైన వేగం కనిపించాలని లేనట్లయితే కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై పట్టణ ప్రజలందరం ఏకమై జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 

ఈసమావేశంలో మాజీ కౌన్సిలర్ బేతాళ నర్సింగరావు, కుతాడి రవీందర్,  మాజీ వార్డు సభ్యులు కొత్తకొండ వెంకటేష్, బర్ల దేవేందర్, మీసాల సుధాకర్, బూరుగు చంద్రశేఖర్ గుప్తా, సిపిఐ నాయకులు కె. జయచంద్ర, ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు, నాయకులు కూసపాటి పద్మారావు, రాజబోయిన రాoచందర్ యాదవ్, సారా శ్రీనివాస్ గౌడ్, గాజుల వీరేందర్ యాదవ్, శివరాత్రి సురేష్ వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.