28-01-2026 12:00:00 AM
మంథని, జనవరి 27 (విజయక్రాంతి): అనతి కాలంలోనే తెలంగాణలో సంచలన కథనాలతో ప్రజల మనసును దోచుకుంటున్న పత్రిక విజయక్రాంతి అని, మంచి వార్తలు ప్రచురిస్తూ విజయక్రాంతి దినపత్రిక ప్రజాభిమానం చూరగొందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవా రం విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పా త్రికేయ వృత్తిలో ఉన్నవారు విలువలతో కూడిన వార్తలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు ఉపయోగకరంగా ఉన్నా యో ప్ర జల వద్దకు తీసుకెళ్లాలి అన్నారు.
కార్యక్రమం లో మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్‌రెడ్డి, మంథని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఐలి ప్రసాద్, మం థని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, నాయకులు సెగ్గం రాజేష్, బొబ్బి లి శ్రీధర్, మంథని డివిజన్ సోషల్ మీడి యా ఇన్‌చార్జి ఆరేళ్లి కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు.