calender_icon.png 12 October, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిక్సిడ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం

11-10-2025 12:00:00 AM

గుహావటి,అక్టోబర్ 10: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్సిడ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ కాంస్యపతకం సాధించింది. తొలిసారి మెడల్ ఖరారు చేసుకుని చరిత్ర సృష్టించిన భారత్ యువ జట్టుకు సెమీఫైనల్‌లో నిరాశే ఎదురైంది. సెమీస్‌లో ఇండోనేషియా 2 తేడాతో భారత్‌ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్లు కొరియాకు షాకిచ్చిన భారత షట్లర్లు సెమీస్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయారు.

35 స్కోర్ తేడాతో పరాజయం పాలయ్యారు. అయినప్పటకీ మిక్సిడ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ అదరగొట్టిందనే చెప్పాలి. ఈ విభాగంలో మనకు మెడల్ రావడం ఇదే తొలిసారి. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌లో ఓడిన రెండు జట్లకు కూడా కాంస్యపతకాలు లభిస్తాయి. ఇదిలా ఉంటే సోమవారం నుంచి వ్యక్తిగత విభాగాల్లో భారత యువ షట్లర్లు పోటీపడబోతున్నారు.