calender_icon.png 12 October, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ రెండో వారంలో ఐపీఎల్ మినీవేలం

11-10-2025 12:00:00 AM

ముంబై, అక్టోబర్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 సీజన్‌కు ముం దు మినీవేలానికి కౌంట్‌డౌన్ మొదలైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ రెండో వారంలో జరగబోతోంది. డిసెంబర్ 13 తేదీల మధ్య వేలాన్ని నిర్వహించేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఫ్రాంచైజీలతో చర్చిం చి తేదీని ఖరారు చేయనుంది. అయితే ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను నవంబర్ 15వ తేదీ లోపు సమర్పించాలి.

మినీ వేలం కావడంతో జట్లలో భారీ మా ర్పులు చోటు చేసుకోకపోవచ్చు. కాకుంటే గత సీజన్ లో నిరాశపరిచిన చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలు ఎక్కువమంది ప్లేయర్స్‌ను రిలీజ్ చేసే అవకాశముంది. చెన్నై జట్టు నుంచి ఇప్పటికే అశ్విన్ రిటైర్మెం ట్ ప్రకటించడంతో 9.75 కోట్లు చేరాయి.

అలాగే రాజస్థాన్ జట్టులో సం జూ శాంసన్‌ను వదిలేయడం ఖాయం గా కనిపిస్తోంది. మిగిలిన ఫ్రాంచైజీల్లో భారీ ధర ఉన్న ఆటగాళ్ళను వేలంలోకి వదిలేయొచ్చు. ఇదిలా ఉంటే గత రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని విదేశాల్లో నిర్వహించగా.. ఈ సారి స్వదేశంలోనే జరపాలని బీసీసీఐ యోచిస్తోంది