11-10-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ టీ ట్వంటీలతో పాటు టెస్ట్ ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో భారత్ ఆడే టెస్ట్ మ్యాచ్‌లలో వీరిద్దరినీ అభిమానులు ఎంతో మిస్ అవుతున్నారు.
తాజాగా ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా పలువురు అభిమానులు రోకో ద్వయంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి నెంబర్లు, పేర్లున్న జెర్సీలు ధరించి, మిస్ యూ రోహిత్,కోహ్లీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.