15-05-2025 02:21:55 AM
కరీంనగర్ క్రైం,మే14(విజయక్రాంతి): ప్రభుత్వ బిసి బాలికల హాస్టల్లో ఉంటూ ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సిరిచందన డెహ్రాడూన్ లో జరిగిన ఏసియన్ పవర్ లిఫ్టింగ్ జూనియర్ విభాగంలో కాంస్య పథకం సాధించారు. ఏసియన్ యూనివర్సిటీ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధిం చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సిరి చందనను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిరిచందనను బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, జిల్లా యువజన క్రీడా అధికారి శ్రీనివాస్ అభినందించారు.