calender_icon.png 25 August, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం ఎమ్మెల్యేల ధర్నా

25-08-2025 01:16:07 PM

పాల్వాయిని అరెస్టు చేసిన పోలీసులు..

కుమ్రం భీం ఆసిఫాబాద్/కాగజ్ నగర్ (విజయక్రాంతి): యూరియా కొరత ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova Lakshmi) జిల్లా కేంద్రంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద ధర్నా చేపట్టగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(MLA Palvai Harish Babu) బట్ పల్లి చౌరస్తాలో ధర్నాకు దిగారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకేసారి యూరియా కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కాగజ్ నగర్ లో ధర్నా చేపట్టడంతో ఇరువైపులా భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ధర్నా విరమించాలని పాల్వాయి హరీష్ బాబును కోరినప్పటికీ ఆయన వినకపోవడంతో అరెస్టు చేసి బలవంతంగా వాహనంలో అక్కడి నుండి తీసుకొని వెళ్లారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాలలో బీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు సహకార సంఘాల ఎదుట రైతులతో కలిసి యూరియా కోసం ధర్నా కార్యక్రమాలు చేపట్టారు.