calender_icon.png 25 August, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి వినాయకులతో కాలుష్య నియంత్రణ

25-08-2025 12:38:40 PM

మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన కాకతీయ విద్యార్థులు

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో హైస్కూల్(Kakatiya Techno High School) విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి వాటిని పంపిణీ చేస్తూ కాలుష్య నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన విగ్రహాలను బాటసారులకు, దుకాణాదారులకు అందజేస్తూ కాలుష్య నియంత్రణ గురించి వివరించారు. మట్టి గణపతియే మహా గణపతి అని పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి గణపతులను పూజించాలని నినాదాలు చేశారు.

పాఠశాల కరస్పాండెంట్, బిస్మాట్ (బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ) స్టేట్ జనరల్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మట్టి వినాయకులను కూరగాయలతో, నవధాన్యాలతో, ఆకులతో వివిధ రకాల ఆకృతులలో తయారు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండి ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు. వినాయకులను తయారుచేసిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.