25-08-2025 12:31:30 PM
మనోహరాబాద్ (విజయక్రాంతి): బీజేపీ నాయకులు పురం మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర రావు(BJP President Ramchander Rao) ఆశీర్వాదం కోరి వారి నివాస గృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పురం మహేష్ ని శాలువాతో సత్కరించారు. బీజేపీ మిత్ర బృందంతో కాసేపు మాటామంతి కలిపి మాట్లాడారు. ఇందులో మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్, సిద్దిపేట జిల్లా కన్వీనర్ నరేందర్ చారి, మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు సాధు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.