25-08-2025 01:22:50 PM
తెల్లవారకముందే 4 గంటలకు క్యూకట్టిన రైతులు.
యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు.
యూరియా కోసం కుటుంబ సభ్యులు లైనోనే
పాక్స్ పోలీసుల బందోబస్తు
టోకన్ లు దొరకక వెందిరిగిన కొంత మంది రైతులు.
బెజ్జంకి: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్న ఘటనలు మండలంలో ప్రతిరోజు దర్శనమిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన సమయంలో యూరియా నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. రైతులు తిండితిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు. మితగా వ్యవసాయం పనులు పక్కన పెట్టుకోవటం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. యురియా కోసం ఒక కుటుంబంలో సభ్యులు అందరూ వచ్చి వేకువజామునే లైన్ కట్టిన దాఖలాలు బెజ్జంకిలో కనిపించాయి.
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రైతులు బారులు తీరారు. యూరియా ఒక లోడ్ బస్తాలకు రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లైన్లో నమోదు చేసుకొని ఆధార్ కార్డుకు ఒకటి రెండు బస్తాల చొప్పున టోకెన్లు పంపిణీ చేశారు.ముందు వచ్చిన రైతులు తీసున్నప్పటికి ఒకటి రెండు బస్తాల సరిపోవని అంటున్నారు. కొంతమంది రైతులకు టోన్ దొరకక నిరాశతో వెనుదిగిరిగి వెళ్లి పోతున్నారు. అధికారులు సరిపడా యూరియా నిల్వలు వున్నాయని చెప్పుతున్నపటికి యూరియాబస్తాల దొరకటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.