calender_icon.png 25 August, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరాలో చిక్కుకున్న గొర్రెల కాపరులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

25-08-2025 12:35:46 PM

బిచ్కుంద (విజయక్రాంతి): ఇటీవల వర్షాల వల్ల ప్రాజెక్టు నీరు వదలగా మంజీరా నదిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు, 650 గొర్లు బిచ్కుంద మండలం గుండెకల్లుర్ గ్రామంలో ఉన్న బాధితులను సోమవారం జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే(Former MLA Hanmanth Shinde) పరామర్శించారు. జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా అర్దరాత్రి వేళల్లో వదిలిన వరద నీరు ఒకేసారి రావడం వల్లే మాకు అంత ఇబ్బంది కావడం జరిగిందన్నారు. ప్రతి సారి కౌలాస్ గేట్లు వదులుతారు. కొద్దీ కొద్దిగా వదిలే వారు. ఈ సారి ముందస్తు సమాచారం లేకుండా ఒకేసారి వదలడం ద్వారా మేము మా జీవులు అక్కడే ఆగాల్సి వచ్చిందని తెలిపారు. మాకు అధికారులు వచ్చి మా ప్రాణాలు కాపాడరని గొర్రెల కాపర్లు తెలిపారు.

ఈ గొర్రెలే మా జీవన ఆధారం అని మాకు కేసిఆర్ ప్రభుత్వంలో కేసిఆర్ ఇచ్చిన గొర్రెల వల్లనే మా జీవనం సాగిస్తున్నామని వారు తెలిపారు. ఇక ముందు వర్షకాలం ఒకే సారి గేట్లు ఏత్తకుండా మా పశుకాపర్లు, గొర్రె కాపర్లు, రైతులు తెలియక పోతారు. వారికీ ప్రాణాపాయం కలుగకుండా చూడాలని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, బస్వారాజ్ పటేల్, మాజీ సర్పంచ్ సంగీత, సాయి గొండ, సంజు పటేల్, హన్మాండ్లు గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.