25-08-2025 01:26:13 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తాళ్లపూస పల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన తండ్రి చితికి తనయ తలకొరివి పెట్టింది. గ్రామానికి చెందిన తుళ్ళ ఐలయ్య(60) అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు భార్య పూలమ్మ, ముగ్గురు కుమార్తెలు మహేశ్వరి, స్రవంతి, ప్రియాంకలు ఉన్నారు. ఐలయ్య పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమార్తె మహేశ్వరి తండ్రి చితికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు.