25-08-2025 01:09:16 PM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు(Prabhakar Rao) బెయిల్ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించట్లేదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేసు దర్యాప్తునకు సంభందించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. దర్యాప్తునకు పిలిచినప్పుడల్లా ప్రభాకర్ రావు హాజరవుతున్నట్లు ప్రభుత్వ న్యాయవ్యాది తెలిపారని పేర్కొంది. ఎలక్ట్రానిక్ పరికారలు, సాక్ష్యాధారాలు ట్యాంపరింగ్ చేశారని.. డేటా రికవరీకి ప్రభాకర్ రావు సహకరించట్లేదని న్యాయవ్యాది తెలిపారు. ప్రభాకర్ రావు ల్యాప్ట్యాప్ అంతా ఫార్మాట్ చేసి ఇచ్చారని సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా(Solicitor General Tushar Mehta) తెలిపారు. అలాగే ల్యాప్ట్యాప్ లో ఎలాంటి డేటా లేకుండా చేశారని తుషార్ మెహతా అన్నారు. జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేసి, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు పూర్తికి మరో నాలుగు వారాల సమయన్ని ఇచ్చారు.