calender_icon.png 25 August, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ వస్తా.. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతా

25-08-2025 01:05:13 PM

  1. దేశానికి అతిపెద్ద సంపద యువతే
  2. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం..
  3. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకు ఓయూ వేదిక..
  4. ఓయూకి గొప్ప చరిత్ర ఉంది.. 
  5. ఉస్మానియా విద్యార్థిగా  రాజకీయాల్లో జైపాల్‌ రెడ్డి.
  6. జార్జిరెడ్డి, ఓ గద్దర్‌ను అందించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం నాడు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. రూ. 90 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రారంభించారు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా వర్సిటీ, తెలంగాణ అవిభక్త కవలు లాంటివన్నారు. ఉస్మానియాలో వర్సిటీలో పర్యటించాలని వీసీ ఆహ్వానించారని సీఎం తెలిపారు. ఓయూలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని కోరారని చెప్పారు. పీవీ నరసింహరావు, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినా.. ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్సిటీయే అన్నారు. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా వర్సిటీయేనని(Osmania University) పేర్కొన్నారు. యాదయ్య.. తెలంగాణ సాధన కోసం అమరులయ్యారని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ ఐపీఎస్, ఐఏఎస్ లను అందించిందన్నారు.

ఉస్మానియా వర్సిటీకి గొప్ప చరిత్ర ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వందేళ్లలో ఓయూకు వీసీగా దళితుడిని నియమించిందని చెప్పారు. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారని ఆరోపించారు. ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయని తెలిపారు. యువ నాయకత్వం దేశానికి అవసరం ఉందన్నారు. దేశానికి అతిపెద్ద సంపద యువతే అన్నారు. ఉస్మానియా వర్సిటీలో చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. పాఠశాలలు, కళాశాలలను గంజాయి పట్టి పీడిస్తున్నాయని చెప్పిన సీఎం సమాజంలో గంజాయి, డ్రగ్స్ విస్తరించిందని తెలిపారు. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవని, విద్యార్థులకు తాను ఇచ్చేది నాణ్యమైన విద్య మాత్రమే అన్నారు. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. తాను సీఎం అయ్యాక సామాజిక బాధ్యతగా వర్సిటీలకు వీసీలను నియమించానని ఆయన పేర్కొన్నారు. చదువు ఒక్కటే అన్నింటికి పరిష్కారం అన్నారు. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించండని సూచించారు. ''నేను మళ్లీ ఓయూకు వచ్చి ఆర్ట్స్ కాలేజీ వద్దనే మీటింగ్ పెడగా.. మీకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తా'' అని సీఎం పేర్కొన్నారు. ఒక వేళ విద్యార్థులు అడ్డుకుని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతానని పేర్కొన్నారు. 60 వేల మందికి నియామక పత్రాలు అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు.