calender_icon.png 22 January, 2026 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు కాంస్య పతకం

02-10-2024 01:34:43 AM

హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి): పన్నుల విధానంలో తెలంగాణ తన పనితీరును చాటుకుంది. ట్యాక్స్ ఇండియా ఆన్‌లై న్ వెబ్‌పోర్టల్-2024కు సంబంధించి పరోక్ష పన్నులు, వాణిజ్య పన్నుల విధానంలో నేషనల్ ట్యాక్సేషన్ అవార్డ్స్ తెలంగాణ ప్రభు త్వానికి కాంస్య పురస్కారాన్ని అందించింది. ప్రజలకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా పారదర్శక పన్ను వ్యవస్థను రూపొం దించినందుకు ఈ అవార్డు వరించింది.

డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి సరళీకృత పన్ను చెల్లింపుల వరకు ఆర్థిక విధానాలను ఆధునీకరించి, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గద ర్శిగా నిలిచింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ చేతుల మీదుగా తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అందుకున్నారు.