18-10-2025 01:18:44 AM
ఇప్పుడేదీ దారి?
కోటా కోసం కొట్లాడితే.. వైకుంఠపాళి ఎదురాయె
బీసీలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ సాధ్యంకాని హామీ!?
* కోటా అమలు చేయాలంటే చట్ట సవరణ అవసరమనే విషయం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తెలియనిది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. స్వతంత్ర భారతదేశాన్ని అత్యంత ఎక్కువ కాలం పాలిం చింది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ హయాంలోని కేంద్ర ప్రభుత్వంలోనూ ఇలాంటి నిర్ణయాలు జరిగాయి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ధోరణి అందుకు భిన్నంగా ఉంది.
* కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల అంశం కోర్టుల జోక్యంతో మళ్లీ మొదటికి వచ్చేది కాదని బీసీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరుతుం దని ఆశల పల్లకీలో కొట్టుమిట్టాడుతున్న బీసీల మనోభావాలతో కాంగ్రె స్ ఆడుకుంటున్నదని ఆవేదన వ్యక్త మవుతున్నది. తెలియక విఫలమైందనే వాదన కంటే.. కావాలనే ఈ రకంగా వ్యవహరిస్తున్నదనే వాదనే బలంగా వినిపిస్తున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : సమాజంలోని అన్నివర్గాలు వారు తమ ఆకాంక్షల మేరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ లబ్ధిపొందుతూ ముందుకువస్తున్నారు. కానీ వెనుకబడిన తరగతులు మాత్రం ఇప్పటికీ వారి హక్కుల సాధనలో తండ్లాడుతూనే ఉన్నారు. రాష్ట్ర జనాభాలో అధికశాతం బీసీలే. వారిని పార్టీలు, ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ వచ్చాయి. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో జరుగుతున్న పరిణామాలే దీనికి నిదర్శనం.
ప్రస్తు తం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుచూస్తుంటే రిజర్వేషన్ల కోసం బీసీలు దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్ నెరవే రేనా అనే అనుమానం కలుగుతున్నది. గడిచిన రెండేళ్ల కాలంలో చోటుచేసుకున్న అనేక మలుపులను గమనిస్తే, రాజకీ య ప్రయోజనాల నడుమ బీసీలు తీవ్రంగా మోసపోయారని స్పష్టమవుతున్నది. వాస్తవానికి 2023 అసెం బ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం మారడం వెనుక బీసీలు కీలకపాత్ర పోషించారు.
కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 10న కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్‌ను బాహాటంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో బీసీలు ఒకింత సంతోషపడ్డారు. ఎన్నో సంవత్సరాలుగా తాము ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల అంశం ఎట్టకేలకు పరిష్కారమయ్యే అవకాశం వచ్చిందని గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చారు. రిజర్వేషన్ అంశంతో కాంగ్రెస్‌కు ఎంతో ప్రయోజనం లభించింది.
కానీ కాంగ్రెస్‌ను గద్దెనె క్కించడం వల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. బీసీలు కోరుకున్నట్టుగానే 42 శా తం రిజర్వేషన్ హామీ లభించినా, అది అమలుకు నోచుకోలేదు. సాధ్యం కాని మార్గంలో బీసీ రిజర్వేషన్లను అమలుచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విఫల ప్రయ త్నాలు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీంతో బీసీలు ఆశిస్తున్న 42 శా తం రిజర్వేషన్ అందని ద్రాక్షగానే మిగిలిపోనుందా అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
ప్రతిపక్షాలపై బురదజల్లేందుకేనా..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలును కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందు పర్చినప్పటి నుంచి ఇప్పటివరకు అటు ప్రతిపక్షాలు, ఇటు బీసీ సంఘాలు, నిపుణులు చట్ట సవరణ గురించి హెచ్చరిస్తూనే ఉన్నా యి. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం పెడచెవిన పెడుతూ వస్తున్నది. దీనికి తోడు రిజర్వేషన్ అమలుచేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు బీసీలను మభ్యపెట్టిందని పరిశీలకులు చెప్తున్నారు.
అయితే రాష్ట్ర ప్ర భుత్వ ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ నెపం వారిపై వేసే ప్రయత్నం చేస్తున్నది. అయితే బీసీ రిజర్వేషన్ కోసం గతంలోనే బీఆర్‌ఎస్ ప్ర భుత్వం ప్రయత్నించింది. అటు బీజేపీ కూ డా శాస్త్రీయబద్ధంగా బీసీ జనాభా లెక్కలు తేలిస్తే చట్ట సవరణకు సిద్ధమని ప్రకటించింది. 42 శాతం రిజర్వేషన్ల అమలుకోసం బీసీలు చేసే పోరాటంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు పూర్తిస్థాయి లో సహకరిస్తున్నాయి.
కానీ కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలపై బురద జల్లాలనే ప్రయత్నిస్తున్నది. బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి తమకే ఉందని చెబుతూనే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నది. కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రా ధాన్యత ఇస్తూ, బీసీల ప్రయోజనాలను మంటగలుపుతున్నదని విమర్శకులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్త శుద్ధి ఉంటే రిజర్వేషన్ల అంశం న్యాయస్థానాల జోక్యంతో మళ్లీ మొదటికి వచ్చేది కాద ని బీసీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
దశాబ్దాల కల నెరవేరుతుందని ఆశల పల్లకిలో కొట్టుమిట్టాడుతున్న బీసీల మనోభావాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ అంశంలో ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలియక విఫల మైందనే వాదన కంటే.. మొత్తం తెలిసీ, కావాలనే బీసీ రిజర్వేషన్ల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తున్నదనే వాదనే బలంగా వినిపిస్తున్నది.
రిజర్వేషన్ల హామీనే కీలకం..
తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పా ర్టీని గద్దె దించడంలో బీసీ రిజర్వేషన్ అం శం కీలక పాత్ర పోషించింది. గత ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి పలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కొలిక్కి రాలేదు. దీనిని అదనుగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలుచేస్తామని ప్రకటించింది.
దీంతో కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా న మ్మిన బీసీలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపా రు. అయితే అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ పార్టీ మాత్రం హామీని నిలబెట్టుకోలేకపోయింది. వాస్తవానికి కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ నిర్వహించి బీసీ రిజర్వేషన్‌ను అమలుచేయ డంలో భాగంగా రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణనను చేపట్టాలని నిర్ణయించింది. సీపెక్ స ర్వే కోసం రూ. 150 కోట్లు కూడా కేటాయించింది.
వెంటనే బీసీ కమిషన్ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటుచేసింది. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే చట్ట బద్ధత ఉండదని, ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేయాలని వాదిస్తూ పలువురు బీసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించా రు. దీంతో బూసాని వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను ప్రభు త్వం ఏర్పాటుచేసింది. సర్వేను విజయవంతంగా పూర్తి చేసింది. కానీ ఆ సర్వేపై బీసీ ల వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రాష్ట్రంలో ముస్లింలతో కలి పుకొని బీసీలు మొత్తం 56 శాతం ఉన్నారని సర్వేలో తేల్చారు. కానీ వాస్తవాన్ని కప్పిపుచ్చి కావాలనే బీసీల జనాభా తగ్గించారని అప్పుడే బీసీలు ఆరోపించారు. అ యితే కనీసం 42 శాతం రిజర్వేషన్ అమలవుతుందనే నమ్మకంతో బీసీల జనాభా ను తగ్గించారనే అంశంలో వారు సర్దుకుపోయారు. అనంతరం ప్రభుత్వం అసెం బ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపించారు.
బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యే క ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించారు. అది కూడా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. బీసీల నుంచి ఒత్తిడి, హైకోర్టు సై తం స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 30 వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
దీంతో ఇక చేసేదేమీ లేక ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసింది. అయితే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు మాత్రం బీసీలకు ఎంతమాత్రం ప్రయోజనం చేకూర్చలేకపోయాయి. వాస్తవానికి బీసీలు తమకు చట్టబద్ధంగా సంక్రమించే 42 శాతం రిజర్వేషన్లు కావాలని మొదటినుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ చట్ట సవరణ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమేమిటో..!
రిజర్వేషన్లు అమలు చేయాలంటే చట్ట సవరణ అవసరమనే విషయం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తెలియనిది కాదని పలువురు అభిప్రాయపడు తున్నారు. స్వతంత్ర భారతదేశాన్ని అత్యంత ఎక్కువ కాలం పాలించింది.. ఇటు ఉమ్మడి ఏపీలో అత్యధికంగా పాలించింది కాంగ్రెస్ పార్టీ అనే విష యం తెలిసిందే. కాంగ్రెస్ హయాంలోని కేంద్ర ప్రభుత్వంలోనూ ఇలాంటి నిర్ణయాలు జరిగాయి. కానీ ప్రస్తుతం తెలం గాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ధోరణి అందుకు భిన్నంగా ఉంద ని వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే చట్ట సవరణ లేకుండా బీసీలకు 42 శా తం రిజర్వేషన్ అమలుచేయడం సా ధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మభ్యపెడుతున్నదనే ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బీసీ డిక్లరేషన్‌లో రిజర్వేషన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీసీలను మోసగించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ప్రభు త్వం ప్రకటించింది.
వాస్తవానికి కులగణన సర్వే మొదలు, ప్రత్యేక జీవో ఇవ్వ డం, దానిపై సుప్రీంకోర్టు ఆశ్రయించడంవరకు, ఇప్పటివరకు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. వారి సూచనలు, సలహాలతోనే నిర్ణయాలు తీసు కుంటుంది. అయితే పలుమార్లు న్యా య నిపుణులు సలహాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి చట్ట సవరణ లేకుండా బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదనే విషయం బోధపడటం లేదా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇంకా సం ప్రదింపులు చేస్తే బీసీ రిజర్వేషన్ సాధ్యమవుతుందని.. ఇప్పటికే సగం కాలం కాస్తా గడిచిపోయిందని బీసీలు ప్రశ్నిస్తున్నారు. ఇంకో మూడేళ్లు కాలయా పన చేస్తే.. పుణ్యకాలం గడిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చట్ట సవరణ లేకపోవడంతోనే..
వాస్తవానికి రిజర్వేషన్ల పెంపు కేవలం పార్లమెంట్‌లో చట్ట సవరణతో మాత్రమే సాధ్యమవుతుంది. అయితే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన 69 శాతం రిజర్వేషన్ కూడా రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా సాధించుకున్నది. తమిళనాడు తరహాలోనే తెలంగాణలోనూ బీసీ రిజర్వేషన్లు అమలుచేయాలంటే చట్ట సవరణ తప్పనిసరి. కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు అభ్యంతరం చెప్పింది.
తెలంగాణలో చేసిన సర్వే శాస్త్రీయబద్ధంగా జరగలేదని, బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగానే తగ్గించారని ఆరోపించింది. దీంతోపాటు తెలంగాణలోని ముస్లింలను బీసీ వర్గంలో కలపడాన్ని తప్పుబట్టింది. ఈ కారణాలను చూపుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో చట్ట సవరణకు అంగీకరించలేదు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభు త్వం నిర్వహించిన కులగణన శాస్త్రీయబద్ధంగా చేపట్టి, బీసీల జనాభాను సరైన గణాంకాలతో వెల్లడిస్తే ఈ సమస్యకు ఎప్పుడో పరిష్కారం లభించేది.
కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ క్రమం లో చట్ట సవరణ కాకపోవడంతో బీసీ రిజర్వేషన్ అమ లు అసాధ్యంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీచేసినప్పటికీ, దానిపై న్యాయస్థానాల్లో పలువురు సవాల్ చేశారు. వాస్తవానికి రాష్ట్రాల పరిధిలో రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా, ప్రత్యేక ఆర్గినెన్స్ రూపొందించినా, ప్రత్యేక జీవో తీసుకువచ్చినా చట్ట సవరణ లేకుండా అవి నిలబడవు.
ఎందుకంటే చట్ట సవరణ చేయకపోతే వాటిపై న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఉన్నది. ఏ రాష్ట్రమైనా ఆ తీర్పుకు లోబడి రిజర్వేషన్ల అమలు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేసి న ప్రయత్నాల్లో అటు హైకోర్టు, ఇటు సుప్రీం కోర్టు జో క్యం చేసుకుంది.
ఈ క్రమంలో న్యాయస్థానాలు రిజర్వేషన్లను 50 శాతం సీలింగ్ మించకూడదని, లేని పక్షం లో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించా యి. దీంతో చట్ట సవరణ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని స్పష్టమైంది.