18-10-2025 01:56:41 AM
అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
నిజాంసాగర్, అక్టోబర్ 17( విజయ క్రాంతి): కార్యకర్తల అభీష్టం మేరకే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష(డీసీసీ ప్రెసిడెంట్) ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల లో జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోలాకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానిం చారు.
దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, దొంగ ఓట్లతో గెలిచిన దేశ ప్రధాని మోడీ గారు వెంటనే గద్దె దిగాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఓట్ చోర్ - గద్దే చోడ్ ‘ సిగ్నేచర్ క్యాంపెయిన్ (సంతకాల సేకరణ) ఏర్పాటు చేసి కార్యకర్తలు, ప్రజల సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ. పార్టీ కార్యకర్తలు, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షుల అభీష్టం మేరకే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నియామకం జరుగుతుందన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడం శుభపరిణామన్నారు.
ఈ ప్రక్రియ ద్వారా పార్టీ కోసం కష్టపడే నిబద్ధత కలిగిన నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే వెసలుబాటు కలుగుతుందన్నారు.. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేసే అధ్యక్షుడికి మనమంతా సంపూర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట
బిచ్కుంద, అక్టోబర్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిట్లం మండల స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమాన్నిy జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులలో శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.అనంతరం పిట్లం మండల కేంద్రంలో అపోలో డయాగ్నొస్టిక్స్ సెంటర్ ను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, శ్రీ సద్గురు బండయప్ప స్వామి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నూతన సెంటర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు