18-10-2025 01:12:08 AM
సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం
కరీంనగర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. రసమయి బూతు పురాణంతో కూడిన అసహ్య ఆడియో లీక్ గురువారం కలకలం రేపగా తాజాగా శుక్రవారం ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడిన ఆడియో ఒకటి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
‘మీడియా ప్రతినిధులు అంటే గౌరవంగా ఉండాలి.. మీరు వాడు ఏ ది చెబితే అది రాస్తారా? మీరేమైనా పోస్ట్‌మన్ ఉద్యోగం చేస్తున్నారా? అంటూ ఆడియోలో ఎమ్మెల్యే ఘాటుగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వాయిస్‌తో ఉన్న ఈ రెండు ఆడియోలు సోషల్ మీడియా వేదికగా కలకలం రేపుతున్నాయి.
తిమ్మాపూర్‌లో కేసు నమోదు
రసమయి ఏకంగా కవ్వంపల్లిపైనే కాకుం డా కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపదజాలంతో విరుచుకుపడటం కాంగ్రెస్ వర్గీ యుల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే మానకొండూర్ నియోజకవర్గం తి మ్మాపూర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కవ్వంపల్లి అనుచరులు కరీంనగర్ సీపీ తో పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, ఇల్లంతకుంట, బెజ్జంకి మండ ల కేంద్రాల్లో రసమయి బాలకిషన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించి ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే బెజ్జంకి మండలం గుండారంలోగల రసమయి బాలకిషన్ ఫాంహౌజ్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రెండు గంట లపాటు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
* ‘రాత్రి అయ్యిందంటే డ్రగ్స్ తీసుకోవడం.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఇదేనా నీ సంస్కారం పద్ధతి మార్చుకోకపోతే క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి పండబెట్టి తొక్కుతా.. పది సంవత్సరాల్లో నేను ఏం చేశానో, రెండు సంవత్సరాల్లో నువ్వు ఏం చేశావో తేల్చుకుందాం’
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
* ‘ఖబడ్దార్ రసమయి.. పోలీసుల పోస్టింగ్‌ల కోసం డబ్బులు తీసుకున్న చరిత్ర నీది..స్థానిక సీఐ కోసం అప్పటి సీపీనే బదిలీ చేయించా.. డబ్బులు తీసుకుంటే వాయిస్ ఉండదు. మేం పారదర్శక పాలన చేస్తున్నాం. నువ్వు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డావు నేను చదువుకున్న రోజుల్లోనే లగ్జరి లైఫ్ అనుభవించా.. టీచర్ ఉద్యోగం చేస్తూ.. దెబ్బలు తీన్న చరిత్ర నీది’
కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ