18-10-2025 01:07:46 AM
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : ‘అధికార పార్టీ మంత్రుల మధ్య క మీషన్ల వాటా కోసమే పంచాయితీ నడుస్తోంది..ఇటీవల ఓ సిమెంట్ వ్యాపారిని మం త్రి కొండా సురేఖ అప్పటి ఓఎస్డీ, సీఎం సన్నిహితుడు తుపాకీతో బెరించినట్లు ఆరోపణలు వచ్చాయి.. ఆ తుపాకీ సీఎం పంపారని వారంతలొస్తున్నాయి.. హోంశాఖ సీఎం వద్దే ఉన్నా దీనిపై ఎందుకు విచారణ జరప డం లేదు’ అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం, మంత్రులు పాలన గాలికి వదిలి పర్సనల్ పంచాయితీలు పెట్టుకుంటున్నరని మం డిపడ్డారు. కమీషన్లు, కాంట్రాక్టులు, వాటా లు, కబ్జాలు, పోస్టింగుల కోసం పోట్లాడుకుంటున్నారని, ఇది మంత్రుల కేబినెట్ కాదు, దండుపాళ్యం ముఠా లెక్క ఉందని ఎద్దేవా చేశారు. అతుకుల బొంతగా ఉన్న ప్రభుత్వం లో ఎప్పుడు ఏం జరుగుతదో అని స్వయం గా మంత్రులే భయపడుతున్నరని, అధికారంలో ఉన్నపుడే అందినకాడికి దండుకోవా లని చూస్తున్నరని చెప్పారు.
పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నరని, కాంగ్రెస్ తప్పిదాల వల్ల టీఎస్‌ఐపా స్ వచ్చిన తర్వాత గత ఎనిమిది ఏండ్లలో అ తి తక్కువ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్‌మెంట్లు రేవంత్ రెడ్డి కాలంలో వెచ్చించాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఎస్ తెచ్చి అనుమ తులు సులభతరం చేసి, పెట్టుబడులకు స్వర్గధామంగా రాష్ట్రాన్ని మార్చడంతోపాటు పా రిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేశామని, కానీ ఇప్పుడు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి గన్ కల్చర్ తెచ్చారని, అక్రమ వ సూల్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఒక మంత్రి కుమార్తెనే సీఎం సన్నిహితులే తుపాకీ పట్టి బెదిరించారని, సీఎం జపాన్ నుంచి ఫైల్ ఆపించారని, ఇంకో మంత్రి టెం డర్లు మాకు దక్కవద్దని హుకుం జారీ చేశారని స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు.
రాష్ర్టంలో అరాచకం రాజ్యమేలుతున్నా బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని, ముఖ్యమంత్రే తుపాకీ పంపారు అంటే ఎందుకు విచారణ జరపరని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం కాకుంటే, మీది బడే భాయ్ చోటే బాయ్ సంబంధం లేదు అంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ వెంటనే స్పందిచాలని డిమాండ్ చేశారు.
ప్రజలను అరిగోస పెట్టినందుకు విజయోత్సవాలా
విజయోత్సవాలు దేనికి.. తుపాకీలు పెట్టి వసూళ్లు చేశామనా?, మంత్రులు మంత్రు లు కొట్టుకుంటున్నందుకా?, పథకాలు అమలు చేయనందుకా?, ప్రజలను అరిగోస పెడుతున్నందుకా? అనిప ప్రశ్నించారు. ఇం కెంత కాలం మోసం, మభ్య పెడతారని నిలదీశారు. కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా కొత్తగా హ్యామ్ మోడల్ అంటున్నారని ఆరోపించారు. దిగ్విజయంగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు.
మంత్రులు గొడవలు పెట్టుకుంటుం టే సీఎం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మంత్రులపై ఆరోపణలపై లీగల్ గా ముందుకు వెళ్తామని, ఏ ఏజెన్సీలకు సంస్థలకు ఫిర్యాదు చేయాలన్న దానిపై ఆలోచి స్తున్నామని స్పష్టం చేశారు. పెట్టుబడిదారు లు, వ్యాపారస్తులు, సినిమా పెద్దలకు, రియ ల్ ఎస్టేట్ వ్యాపారులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.