వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఉమా శ్రీధర్
చేర్యాల,ఏప్రిల్ 27: బిఆర్‌ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తిచేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేర్యాల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో ఘనంగా నిర్వహించారు. పదవ వార్డులో వైస్ చైర్ పర్సన్ మేడిశెట్టి ఉమా- శ్రీధర్ పదో వార్డ్ ఇంచార్జ్ చేర్యాల మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కాసుల శ్రీను జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా వైస్ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కుట్రలు ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూసినా భయపడకుండా పోరాడినము అని ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ముందుకు సాగుతున్నామని ఉమా శ్రీధర్ స్పష్టం చేశారు.
అమరుల త్యాగాలు మరువలేనివని వారి ఆకాంక్షల సాధనే ధ్యేయంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు.జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం అవుతుంది అని అన్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని త్వరలోనే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాలనర్సయ్య, మాజీ చేర్యాల ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు పట్టణ బిఆర్‌ఎస్ నాయకులు,వార్డు సభ్యులు ఇప్పకాయల భాస్కర్,శ్రీకాంత్,బూరగోని రాములు,తిగుళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.






