18-10-2025 01:53:51 AM
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చిందే బీఆర్‌ఎస్ అని మంత్రి సీతక్క ఆరోపించారు. అబద్ధాలతో హరీశ్ రావు దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కేబినెట్ సమావేశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని మంత్రి సీతక్క ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడి యాతో సీతక్క మాట్లాడారు. ‘నా తల్లి తం డ్రులు సమ్మయ్య, సమ్మక్క సాక్షిగా చెబుతు న్నా.
నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే చర్చ జరిగింది. హరీశ్ రావు చెప్పిన ఒక్క మాటలో కూడా నిజం లేదు’ అని సీతక్క స్పష్టం చేశారు. హరీష్ రా వు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ‘ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ గొడవల్లో తుపాకుల తో కాల్పులు జరిపితే ఇద్దరు చనిపోయారు.
హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటలో సబ్ రిజిస్టార్ కార్యాలయ ఆవరణలో కాల్పు లు జరిపి రూ.43 లక్షలు ఎత్తుకెళ్లారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉండగానే అడ్వకేట్ వామనరావు దంపతులను నరికి చంపారు. అవినీతికి, అబద్ధాలకు, అహంకా రానికి నిలువెత్తు నిదర్శనం బీఆర్‌ఎస్’ అని సీతక్క మం డిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు మాట్లాడే స్వేచ్ఛే లేదని, అంతా పంజరంలోని చిలుకల్లా ఉన్నారని గుర్తుచేశారు.
కానీ ‘ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు స్వేచ్ఛ గా పనిచేసే వాతావరణం కల్పించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ గతంలో కెసిఆ ర్ హయాంలో క్యాబినెట్ సమావేశాలు నామమాత్రంగానే జరిగేవి’ అని అన్నారు. హరీష్ రావు ఇప్పుడు గుమస్తా తెలంగాణ పత్రిక అబద్ధపు కథనాలను అమ్మే సేల్స్‌మెన్‌గా మారిపోయారని సీతక్క విమర్శించా రు.
‘బీఆర్‌ఎస్ పార్టీలో ఇప్పుడు నాలుగు స్తంభాలాట నడుస్తోంది. అదే కారణంగా కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావ ం లేదు’ అని అన్నారు. ‘మీ అవినీతికి సజీవ సాక్ష్యం కాలేశ్వరం ప్రాజెక్టే. కేసీఆర్ కూతురు కవిత చేసిన అవినీతి ఆరోపణలకు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అవాస్తవాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తే ప్రజలే త్వరలో మీకు తగిన బుద్ధి చెబుతారు’ అని మంత్రి సీతక్క హెచ్చరించారు.