18-10-2025 01:54:57 AM
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
-డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎస్పీకి చేసిన కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కామారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ సభ్యులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ప్రోకేటివ్ పోస్టులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో వేరు వేరు వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం శాంతి భద్రతలకు భంగం చేయడం, ప్రభుత్వానికి అపఖ్యాతి పరచడం వంటి విషయాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కాంగ్రెస్ నాయకులు కోరారు. బిఆర్‌ఎస్ పార్టీ సభ్యులు, ఆలోచనలు పార్టీ ప్రతినిధి కల్వకుంట్ల తారక రామారావు మార్గ నిర్దేశంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్దేశపూర్వకంగా దూషణాత్మకమైన కలిగించే పోస్టులు చేస్తున్నారని ఎస్పీకి తెలిపారు. ఈ ఫిర్యాదు తెలంగాణ రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అవమానకరంగా తప్పుడు ఆరోపణలతో రూపొందించబడి ప్రజల్లో ఉద్రిక్తత అశాంతిని సృష్టించాలని ఉద్దేశంతో ఈ పోస్టులు కనిపిస్తున్నాయని తెలిపారు.
ఆ పోస్టులలో నిరాదర ఆరోపణలు, అసభ్య పద జాలం, తప్పుదారి పట్టించే కథనాలు ఉండి ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పోస్టులు ముఖ్యంగా ట్విట్టర్ అంటే అధికారిక సామాజిక మాధ్యమాల వేదికలలో విస్తృతంగా ప్రచారం చేయబడుతున్నాయన్నారు. ఈ పోస్టులు బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక హ్యాండిల్ లో కేటీఆర్ ఆయన అంచర్ల ద్వారా పోస్టులు చేయబడ్డాయని తెలిపారు. సంబంధిత పోస్టుల లింకులు టెకస్ట్ మెసేజ్లు ఎస్పీకి సమర్పించారు.
పోస్టుల లింకులను అందజేస్తూ వాటిపై దర్యాప్తు జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు ఎస్పీ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్ చింతల రవీందర్ గౌడ్, సిరాజుద్దీన్, సర్వర్, చందు, సత్యం, రఫీ, అజ్మత్, లక్కపత్ని గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.