calender_icon.png 18 October, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21 నుంచి పత్తి కొనుగోళ్లు

18-10-2025 01:04:22 AM

  1. రైతుల కోసం ‘కపాస్ కిసాన్’ యాప్!
  2. రాష్ట్రంలో 122 సెంటర్లు
  3.   31 నుంచి నవంబర్ 25 వరకు యూనిటీ మార్చ్ 
  4. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రైతులు పత్తిని విక్రయించుకు నేందుకు ‘కపాస్ కిసాన్ యాప్’ను రూపొందించినట్ల్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈనెల 21 నుంచి పత్తి కొనుగోలు ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలు ప్రారంభమవుతాయని, రైతులు దీపావళి నుంచి కపాస్ కిసాన్ యాప్‌లో డేట్ బుకింగ్ చేసుకుని తగిన సమయానికి పంటను విక్రయించుకోవచ్చని తెలిపారు.

గతం లో తెలంగాణలో  పత్తి కొనుగోలుకు110 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఉండేవని, ఈ యేడు మరో 12 సెంటర్లు పెంచడంతో ఆ సంఖ్య 122కు చేరిందని తెలిపారు. ఈ సెంటర్లు దీపావళి తర్వాత ప్రారంభమవుతాయని చెప్పారు. మార్చి వరకు రైతుల పంటను కొనుగోలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

మహారాష్ర్టలో కొంతమంది రైతులు పత్తి దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారని, మన రాష్ర్టంలో కూడా అనువైన ప్రాంతాల్లో ఆ విధానాలను అమలు చేసి, దిగుబడి పెంచే ప్రయ త్నం చేయాలన్నారు. ఇందుకు మార్చి తర్వాత మహారాష్ట్రకు రైతులను తీసుకెళ్తామన్నారు.

ముఖ్యంగా మహారాష్ర్టలోని అకోలా ప్రాంతంలోని రైతులు హైడెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్నార ని, దాని వల్ల పంట దిగుబడి రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో పత్తి దిగుబడి పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు  రాష్ర్ట ప్రభుత్వానికి, రైతుల కు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. 

రూ.600 కోట్లతో ‘కపాస్ క్రాంతి మిషన్’

దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు ఒకే రకమైన నిబంధనలు ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పత్తి రంగాన్ని పటిష్ఠం చేయడానికి  రూ.600 కోట్లతో ‘కపాస్ క్రాంతి మిషన్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపా రు. మెరుగైన పత్తి సాగు చేయాలని, 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.24,825 కోట్ల విలువైన 173 లక్షల బేల్స్‌ను సీసీఐ ద్వారా కొనుగోలు చేసిందని, కానీ 2014 నుంచి గత 10 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని పెంచి రూ.1.37 లక్షల కోట్లను ఖ ర్చు చేసి 473 లక్షల బేల్స్‌ను కేంద్రం కొనుగోలు చేసిందని వివరించారు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం రూ.65 వేల కోట్లను పత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభు త్వం ఖర్చు చేసిందని తెలిపారు.

యాప్‌పై  21నుంచి రైతులకు అవగాహన

కపాస్ కిసాన్ యాప్‌పై  రైతులకు  అవగాహన కల్పించేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు.  ఈ యాప్ గురించి రైతులు తెలుసుకోవడానికి కరపత్రాలు ముద్రిం చి, వీడియోలు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యాప్‌ను తెలుగుతో సహా తొమ్మిది భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులు  మధ్యదళారీలకు అవకాశం ఇవ్వకుండా, తమ పంటను నేరుగా సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని  విజ్ఞప్తి చేశారు.  నకిలీ విత్తనాల విషయం లో కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే పలువురి కంపెనీలు, డీల ర్‌షిప్‌లను రద్దు చేశామని పేర్కొన్నారు.

రాష్ర్టం లో 345 జిన్నింగ్ సెంటర్లు ఇప్పటికే నోటిఫై అయ్యాయని, సీసీఐతో అన్ని ఒప్పందాలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ర్టంలో సు మారు 24 లక్షల మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా పత్తి దిగుబడిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు.

దేశ ఐక్యతను చాటేలా సర్దార్ యూనిటీ మార్చ్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయిం చామని, అందుకు ఈనెల 31 నుంచి నవం బర్ 25 వరకు సర్దార్ యూనిటీ మార్చ్ పాదయాత్రలు చేపడుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. రాజ కీయాలకు అతీతంగా అందరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు రోజుకు 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేపడతామన్నారు. 

దీపావళి నుంచి పాద యాత్ర క్యాంపెయిన్‌ను చేస్తామని, జిల్లాల్లోని ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బాధ్యత  తీసుకొని విజయవంతం చేయా లని కోరారు. నవంబర్ 26న సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రామం నుంచి 152 కి.మీ.నేషనల్ మార్చ్ ను చేపడతామని తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యత చాటే లా అన్ని రాష్ట్రాల్లో ఈ మార్చ్‌ను చేపడుతున్నామని పేర్కొన్నారు.