calender_icon.png 1 September, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం నీళ్లతో అభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు

01-09-2025 02:43:22 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం నీళ్లతో బీఆర్ఎస్ నాయకులు సోమవారం అభిషేకం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యూరియా కోసం క్యూలో నిలుచున్న రైతులతో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రం సస్యశ్యామలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా రైతాంగాన్ని వంచిస్తోందని అన్నారు. యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

రైతన్నకు సరిపడా యూరియా అందించలేని ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలని అన్నారు. యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక  శ్రీనివాస్  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, సీనియర్ నాయకులు.వర్ధినేని రవీందర్రావు, వార్త మల్లా రెడ్డి, తాళ్ల పెళ్లి శ్రీనివాస్, ముక్క రమేష్, ఇమ్రాన్, ఐలయ్య, లావణ్య, శ్రీధర్, యాదగిరి, తిరుపతి, నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.