calender_icon.png 1 September, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన గురుకులంలో విద్యకు నోచుకోని విద్యార్థులు

01-09-2025 02:40:37 PM

మూడు నెలలు గడుస్తున్న ఇంటర్ విద్యలో అందుబాటులోకి రాని లెక్చరర్లు..

ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు ఎకనామిక్స్ లెక్చరర్ లేరు..

మేము ఏం పాపం చేశామంటున్న గిరిజన ఇంటర్ విద్యార్థులు..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గిరిజన గురుకుల కళాశాల(Tribal Gurukul College)లో మూడు నెలలు గడిచిన నేటి వరకు పూర్తిస్థాయిలో అధ్యాపకులు అందుబాటులోకి రాకపోవడంతో, తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు ఇంటర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గురుకులంలో మహిళ అధ్యాపకుల కోసం జిల్లా అధికారులు పేపర్లో ప్రకటనలు చేసినప్పటికీ, నేటి వరకు ప్రధాన సబ్జెక్టులకు అధ్యాపకులు రాకపోవడం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది. గత పది సంవత్సరాల నుండి ఇంటర్ విద్యార్థులకు పురుష లెక్చరర్స్ కూడా బోధించేవారు. ప్రస్తుతం ప్రభుత్వంలో గిరిజన గురుకుల ఆర్సిఓ తీసుకున్న నియంత పాలనతో, పురుష లెక్చరర్స్ కనుమరుగైపోయారు. మహిళ లెక్చరర్స్ ప్రకటన చేస్తే ఎవరు రాకపోవడంతో నేడు ప్రధాన గ్రూపులు బోధించడానికి అందుబాటులోకి లేరు. దీనితో క్లాసుల్లో చెప్పేవారు లేక కాలం గడిచిపోయి మూడు నెలలు దాటింది.

మా చదువులు ఇంతేనా మా బ్రతుకులు ఇంతేనా అని ఇంటర్ విద్యార్థులు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే కనీసం పర్యవేక్షణ లేని జిల్లా ఆర్ఓసి పై విమర్శలు వస్తున్నాయి. తక్షణమే గిరిజన విద్యార్థుల ప్రయోజనాల దుష్ట ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల బోధించడానికి అవసరమైతే ప్రస్తుతం పురుష లెక్చరర్స్ తీసుకొని.. విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని పలువురు విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటర్ కళాశాలలో 120 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు ,ఎకనామిక్స్ బోధించే లెక్చరర్స్ లేరు. జరుగుతున్న సంఘటన పట్ల జిల్లా కలెక్టర్, జిల్లా గిరిజన గురుకుల అధికారి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు కృషితో పూర్తిస్థాయిలో విచారణ జరిపి తక్షణమే నూతన లెక్చరర్స్ ను ఏర్పాటు చేసి, ఇంటర్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు.