calender_icon.png 1 September, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఎస్ ను రద్దు చేసి.. ఓపిఎస్ పునరుద్ధరించాలి..

01-09-2025 02:51:09 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలో స్థానిక చంద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కే.పద్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరు ఈ రోజు భోజన విరామంలో పెన్షన్ విద్రోహ దినమును నల్లబ్యాడ్జీలతో నిరసిస్తూ, కాంట్రిబ్యూటరి పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానమును పునరుద్ధరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎం.ఏ. ఖాద్రీ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. 1-9-2004 ఉద్యోగ ఉపాధ్యాయ జీవిత చరిత్రలోనే చీకటి రోజని, కాంట్రిబ్యూటరి పెన్షన్ పథకం ఒకభూతం పెను శాపంగా మారిందన్నారు.

ఉద్యోగుల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదని వెంటనే స్పందించి తగు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. టీటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మెనిఫెస్టో ప్రకారం సీపీఎస్ రద్దు చేసి, నూతన పీఆర్సీ వెంటనే అమలు పరచాలని, మిగిలిన పెండింగ్ బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లించాలని కోరారు.ఇట్టి నిరసన కార్యక్రమంలో జీ.శ్రీనివాస్, ఎం.రమ, వడ్యారపు మధుసూదన్, కే.మిరియం, తన్నీరు పద్మజ, వెంగల పల్లవి, ఎస్ లత పాల్గొన్నారు.