calender_icon.png 14 July, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌టీఐ చట్టాల పుస్తకాల పంపిణీ

14-07-2025 08:10:22 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం(Right to Information Act) పరిరక్షణ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్, సమాచార చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పుస్తకాలు సోమవారం అందించడం జరుగుతుందని అన్నారు. నిర్మల్ జిల్లా అధ్యక్షులు సి.హెచ్. వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాదిక్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్ ఆర్‌డీవో కార్యాలయంలో పీఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్) ఏ.ఓ.కి సమాచార హక్కు చట్టాల పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సామాన్యుడికి ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని, ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఉద్ఘాటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు. ఆర్‌టీఐ చట్టంపై అవగాహన కల్పించడం, దాని అమలును పర్యవేక్షించడం తమ కమిటీ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహా చట్ట హక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.