calender_icon.png 14 July, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మికుంట రైల్వే స్టేషన్ సమస్యల పరిష్కారానికి కృషి

14-07-2025 08:18:22 PM

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

హుజురాబాద్ (విజయక్రాంతి): జమ్మికుంట రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి(BJP District President Gangadi Krishna Reddy) తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే అధికారులు చెప్పిన సమస్యలు కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. జమ్మికుంటే రైల్వే స్టేషన్ ప్రయాణికులకు, రవాణా సౌకర్యాలకు ఎంతో కీలకమైంది అన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో భాగంగా ఆధునికరించడానికి తగిన కృషి చేస్తున్నారని తెలిపారు. జమ్మికుంట ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాలు కల్పించేందుకు పలు రైలు రైల్వే స్టేషన్లో హాల్టింగ్ అయ్యే విధంగా కేంద్రమంత్రి చొరవ తీసుకుంటున్నా అని తెలిపారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు రాజు, వెంకటరెడ్డి, జమ్మికుంట మండలాధ్యక్షులు సంపత్ రావు,పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, కమలాపూర్ మండలాధ్యక్షుడు రాజేందర్, శ్రీనివాస్, రవి, గణేష్, అశోక్, రామస్వామి, అఖిల్, మహేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.