14-07-2025 08:04:07 PM
బీఆర్ఎస్ నాయకుల నివాళి..
అశ్వాపురం (విజయక్రాంతి): మండల పరిధిలోని చింతిర్యాల మాజీ సర్పంచ్ కల్లూరి లక్ష్మీనారాయణ సోమవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మరణం పట్ల మండల బీఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు. మాజీ సర్పంచ్ లక్ష్మీ నారాయణ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సూదిరెడ్డి గోపిరెడ్డి,పిట్టా శ్రీను,ముత్యాల నరసింహారావు, తాటి నరేష్,చల్లా కిరణ్,కట్టాం నాగేంద్ర, కుర్సం రామారావు,తాటి రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.