calender_icon.png 31 January, 2026 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై బీఆర్‌ఎస్ నాయకుల నిరసన

31-01-2026 12:00:00 AM

నంగునూరు/సిద్దిపేట రూరల్ జనవరి 30: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్  నో టీసులు ఇవ్వడం పై సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో సర్పం చ్ సుమలతశంకర్ ఆధ్వర్యంలో సీఎం రేవం త్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ను తాకడం అంటే తెలంగాణ ఆత్మగౌర వాన్ని దెబ్బతీయడమేనని, అక్రమ కేసులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని చూడటం సరికాదని ఈ సందర్భంగా నాయకులు మండి పడ్డారు. ఈ నిరసనలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వసూరి తిరుపతి, పీట్ల కనక య్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు కాంతుల మ ల్లేశం, మాజీ ఉపసర్పంచ్ రవి, వార్డు సభ్యు లు పోచంపల్లి యాదగిరి, మల్లేశం,స్వామి, రాజేశ్వర్, జెల్ల, స్వామి, నయీం తదితరులు పాల్గొన్నారు.

నంగునూరు లో రాస్తారోక..

ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మాజీ ఎం పీపీ జపా శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని రాంపూర్ క్రాస్ వద్ద సిద్దిపేట-వరంగల్ జాతీయ రహదారిపై పార్టీ కార్య కర్తలు రాస్తారోకో నిర్వహించి,అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ నీ దహనం చేశారు. ప్రభుత్వం ఇలాంటి కుట్రపూరిత రాజకీయా లు మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న రాజగోపాల్పేట ఎస్‌ఐ టి.వివేక్ ,సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను చెదరగొ ట్టారు.అనంతరం ట్రాఫిక్ అంతరాయాన్ని పోలీసులు తొలగించారు.ఈ నిరసనలో నా యకులు వేముల వెంకట్ రెడ్డి, రాగుల సారయ్య, కోల రమేష్ గౌడ్, రాజిరెడ్డి, తిరుపతి,వేణు,నరేష్ ఆయా గ్రామాల సర్పంచులు, బిఆర్‌ఎస్వి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటసిరిసిల్ల రహదారిపై రాస్తారోకో

సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలంలోనీ జక్కాపూర్ గ్రామం వద్ద సిద్దిపేటసిరిసిల్ల రహదారిపై మండలంలోని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. మాజీ సీఎం కెసిఆర్ సిట్ నోటిస్ లు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జక్కాపూర్ గ్రామం వద్ద సిద్దిపేట సిరిసిల్ల రహదారి పై బైటాయించిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి హామీలు గాలికి వదిలేసి రాజకీయ కక్షతో తెలంగాణ తెచ్చిన నాయకుల పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కి నోటిస్ ఇవ్వ డం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన ట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.