calender_icon.png 31 January, 2026 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాగృతిలోకి మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు

31-01-2026 12:00:00 AM

అలంపూర్, జనవరి 30: వడ్డేపల్లి మాజీ జెడ్పిటిసి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాసులు ఆ పార్టీని వీడారు.అనంతరం కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి పార్టీ కండువాను ఆయన కప్పుకున్నారు.ఈ మేరకు గురువారం రాత్రి హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆమె తెలిపినట్లు పేర్కొన్నారు.వీరి వెంట పైపాడు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.